పీఆర్సీ అమలుపై తెలంగాణ ఉద్యోగుల్లో ఆందోళన.. మార్చి నుంచి అమలు చేస్తామని సీఎస్ అభయం

పీఆర్సీ అమలుపై తెలంగాణ ఉద్యోగుల్లో ఆందోళన.. మార్చి నుంచి అమలు చేస్తామని సీఎస్ అభయం
x
పీఆర్సీ అమలుపై తెలంగాణ ఉద్యోగుల్లో ఆందోళన
Highlights

పీఆర్సీ గడువు పెంపుపై ఉద్యోగ సంఘాల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఎప్రిల్ నుంచి పీఆర్సీ అమలవుతుందనుకున్న ఉద్యోగులకు భంగపాటు తప్పలేదు. దీంతో ఉద్యోగ...

పీఆర్సీ గడువు పెంపుపై ఉద్యోగ సంఘాల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఎప్రిల్ నుంచి పీఆర్సీ అమలవుతుందనుకున్న ఉద్యోగులకు భంగపాటు తప్పలేదు. దీంతో ఉద్యోగ సంఘాలు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. అయితే నెల లోపు కమిషన్ రిపోర్ట్ వస్తుందని భరోసా ఇచ్చినట్లు సంఘాల నాయకులు తెలిపారు.

ఉద్యోగులకు ఇచ్చే పిఆర్సీపై ఊగిసలాట కొనసాగుతూ వస్తోంది. తొలి పీఆర్సీ 2018 జూలై 1 నుంచి అమలు కావాల్సి ఉండగా అదే ఏడాది ఆగస్టులోనే వేతనాలు పెంచుతామని కేసీఆర్ ప్రకటించినా అది మాత్రం అమలు కాలేదు. గతేడాది నవంబరు 10 న నివేదిక ఇవ్వాలని పీఆర్సీని ఆదేశించినట్లు సీఎంవో ప్రకటించింది. అయినా నివేదిక ప్రభుత్వానికి చేరలేదు. అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాత దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాకపోడడంతో ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ ప్రకటించారు. అయినా ఉద్యోగులకు ఎంతో కొంత వేతన సవరణ ప్రకటిస్తామని వివరించారు.

అయితే ఇదే సమయంలో పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతున్నందునా మధ్యంతర భృతినైనా అమలుచేయాలని ఇటీవల ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశాయి. దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఇంతలోనే పీఆర్సీ వాయిదా పడటంతో మరింత నిరాశకు గురయ్యారు. పీఆర్సీ గడువును డిసెంబర్‌ 31 వరకు పెంచారు. దీంతో ఉద్యోగ సంఘాలు బుధవారం సీఎస్ సోమేశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎస్‌ను కలిసి తమ నిరాశను వ్యక్తం చేశారు. నెల లోపు కమిషన్ రిపోర్ట్ వస్తుందని ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.

సీఎం కేసీఆర్ తమకు అండగా ఉన్నారని ఉద్యోగులు చెబుతున్నారు. త్వరలోనే పీఆర్సీ వస్తుందని ఆశిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే కేసీఆర్ తో ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీ అవుతుందని తెలిపారు. పిఆర్సీపైనే గంపెడు అశలు పెట్టుకున్న వేతల జీవులు.. వాయిదా పడటం తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత పీఆర్సీ ప్రకటించే అవకాశాలున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories