పాట్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన

Chief Minister KCR Visit to Patna
x

పాట్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన

Highlights

CM KCR: గాల్వాన్ అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

CM KCR: వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ప్రత్యామ్నాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ముందుకెళ్తామన్నారు. కచ్చితంగా నితీశ్ కుమార్ గొప్ప రాజనీతిజ్ఞుడని.. ఆయన సీనియారిటీ దేశానికి ఉపయోగపడుతుందన్నారు. పాట్నా పర్యటనలో ఉన్న కేసీఆర్.. గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. అలాగే సికింద్రాబాద్ ప్రైవేట్ గోడౌన్లో అగ్నిప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. బాధితుల వెంట తాను ఉన్నానని.. బిహార్ కార్మికులు.. తెలంగాణ అభివృద్ధిలో భాగం అయ్యారని గుర్తు చేసుకున్నారు కేసీఆర్.

ముఖ్యమంత్రి కేసీఆర్.. బిహార్ పర్యటనలో మరోసారి జాతీయ రాజకీయాలను స్పృశించారు. కేంద్ర సర్కారు మీద, బీజేపీ విధానాల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీని సాగనంపడంతోనే ఈ దేశానికి మేలు జరుగుతుందన్నారు. ఆ పార్టీని ఈ దేశానికి ప్రమాదకరశక్తిగా అభివర్ణించారు. బీజేపీ ముక్తభారత్ అంటూ నినదించారు. 8 ఏళ్ల పాలనలో దేశానికి మీరేం చేశారో చెప్పాలని మోడీకి సవాల్ విసిరారు. ఏ ఒక్క రంగాన్ని కూడా మోడీ ప్రక్షాళన చేయలేదన్నారు. మతం పేరిట ఉద్రిక్తతలు మాత్రం పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు.

మేకిండియా స్కీమ్ తీసుకురావడంలో మోడీకి ఏమాత్రం ముందుచూపు లేదన్నారు.. కేసీఆర్. ఆయన తీసుకున్న స్ఫూర్తిలో నిజాయితీ ఉంటే జాతీయ జెండాలు చైనా నుంచి ఎందుకు తెప్పించారన్నారు.

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పతనమైందన్నారు.. కేసీఆర్. రైలుతు, పేదలు, మహిళలు ఏ ఒక్కరికీ మోదీ సర్కారు ఏం చెయ్యలేదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నదుల్లో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, కానీ వాటిని ఉపయోగించుకునే ఆలోచన మాత్రం కేంద్రానికి లేదన్నారు. దేశరాజధాని ఢిల్లీలో కూడా తాగునీరు, విద్యుత్ సమస్యలు తీర్చలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఏ ఒక్కటి కూడా సంక్షేమాన్ని కాంక్షించడం లేదన్నారు కేసీఆర్. బడా కంపెనీల వెంట పడటం తప్ప.. పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని... ఒక్క ఆలోచన కడా మోడీ చేయలేదన్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల మోడీకి కనీస ప్రేమాభిమానాలు లేవన్నారు. నిజంగా మోడీ రైతుల మేలు కాంక్షించి ఉంటే.. వారు ఎందుకు రోడ్డెక్కుతారని.. వ్యవసాయ చట్టాల్లో లోపాలు లేకపోతే.. మళ్లీ వాటిని ఎందుకు రద్దు చేస్తారని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories