ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ భద్రత ఫైలుపై సంతకం చేసిన సీఎం

Chief Minister KCR signed on job security file of RTC employees
x

Representational Image

Highlights

* కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ * సీఎం పెద్దమనసుతో టీఎస్‌ ఆర్టీసీని ఆదుకుంటున్నారు -పువ్వాడ

ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. విధి నిర్వహణలో భాగంగా పలు సందర్భాల్లో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని గతంలో ఆర్టీసీ ఉద్యోగులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాలతో మార్గదర్శకాలు రూపొందించింది అధికారుల కమిటీ. దీనికి సంబంధించిన ఫైలు పై సీఎం కేసీఆర్‌ సంతకం కూడా చేశారు.

ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ భద్రత ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్. కేసీఆర్ పెద్ద మనసుతో టీఎస్‌ ఆర్టీసీని ఆదుకుంటున్నారని అన్నారు. సంస్థ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ అభ్యున్నతి దిశగా తీసుకెళ్లడానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ప్రతి ఉద్యోగి సంస్థపై నిబద్ధతతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి పువ్వాడ చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories