Telangana: వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)
Telangana: త్వరలో తెలంగాణలో కొత్త హార్టికల్చర్ విధానం * హార్టికల్చర్ యూనివర్శిటిని బలోపేతం చేయాలి- కేసీఆర్
Telangana: తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలు, నేలలు, వాతావరణాన్ని అనుసరించి హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు మరింత విస్తరించే దిశగా పరిశోధనలు చేపట్టాల్సిన అవసరముందన్నారు. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. హార్టికల్చర్ యూనివర్శిటీని బలోపేతం చేయాలని సూచించారు.
ఆధునిక పద్ధతుల్లో ఉద్యానవన పంటల సాగుకోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలన్నారు సీఎం కేసీఆర్. ఇందుకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్శిటీలోని 300 ఎకరాలను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యానవన విశ్వవిద్యాలయం అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచాలని ఆదేశించారు సీఎం.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయరంగం మూస పద్ధతిలో సాగిందన్న సీఎం.. వరి పంటకే ఆనాటి ప్రభుత్వాలు ప్రాధాన్యతనిచ్చాయని తెలిపారు. సాగునీటి కొరత తీవ్రంగా ఏర్పడి తెలంగాణలో వ్యవసాయం వెనకబడిపోయిందన్నారు. కానీ ఇప్పుడు వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి దిశగా ముందుకు సాగుతుందన్నారు. తక్కువ నీటి వాడకంతో ఎక్కువ లాభాలు ఆర్జించేలా ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు సీఎం కేసీఆర్. ఉద్యానవన నర్సరీలు ఏర్పాటు చేసే వారికి రైతుబంధుతో పాటు ప్రత్యేక ప్రోత్సాహాకాలు అందించేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
సీఎం పోస్టు కోసం బీజేపీతో బంధాన్ని తెంచుకున్న శివసేన
30 Jun 2022 1:18 AM GMTజులై 1న కొలువు దీరనున్న బీజేపీ, ఏక్నాథ్ షిండే సర్కార్
30 Jun 2022 1:00 AM GMTApples: పరగడుపున యాపిల్ తింటే అద్భుతమైన ప్రయోజనాలు..!
30 Jun 2022 12:30 AM GMTBihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMT