Chicken Rates: తెలంగాణలో కొండెక్కిన చికెన్ రేట్లు..సామాన్యుడికి చికెన్ కొనే పరిస్థితి లేదు

Chicken Prices Hike In Telangana
x

Chicken Rates: తెలంగాణలో కొండెక్కిన చికెన్ రేట్లు..సామాన్యుడికి చికెన్ కొనే పరిస్థితి లేదు

Highlights

Chicken Rates ఉత్పత్తి తగ్గడంతో అమాంతం పెరిగిన చికెన్ రేటు

Chicken Rates: తెలంగాణలో కోడి కొండెక్కి కూర్చుంది. మాంస ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. చికెన్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే చికెన్ ధరలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం కిలో 300 దాటిపోవడంతో...సామాన్యుడు చికెన్ ముక్క తినాలంటేనే జంకుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా చికెన్ రేట్లు ఆకాశంవైపు పరుగులు పెడుతుండడంతో..చికెన్ కొనే పరిస్థితి లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

తెలంగాణలో కోడి కొండెక్కి కూర్చుంది. మాంస ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. చికెన్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే చికెన్ ధరలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం కిలో 300 దాటిపోవడంతో...సామాన్యుడు చికెన్ ముక్క తినాలంటేనే జంకుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా చికెన్ రేట్లు ఆకాశంవైపు పరుగులు పెడుతుండడంతో..చికెన్ కొనే పరిస్థితి లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

చికెన్...ఇప్పడీమాట వింటేనే సామాన్యుడు షాక్‌కు గురవుతున్నాడు. చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో...మాంస ప్రియులు చికెన్ షాపు వైపు చూడాలంటేనే జంకుతున్నారు. చికెన్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే చికెన్ ధరలు రెట్టింపు అయ్యాయి. ఏప్రిల్‌లో కేజీ చికెన్ ధర సుమారు 150 ఉంటే..ప్రస్తుతం 300కు చేరింది దీంతో చికెన్ ధరలు చూసి ముక్క తినాలంటే సామాన్యులు జంకుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చికెన్ రేట్లు మండిపోతున్నాయి. ఒకప్పుడు సమ్మర్ సీజన్ వస్తే చికెన్ ధరలు తగ్గేవి. కానీ ఈసారి ఎండాకాలంలో చికెన్ రేట్లు కొండెక్కుతున్నాయి. ఈ సారి రికార్డు స్థాయికి చేరిపోయాయి. హైదరాబాద్‌లో కిలో ధర 300 రూపాయలు దాటేసింది. కొన్ని చోట్ల కిలో చికెన్ ధర 310 నుంచి 330 దాకా పలుకుతోంది. నిజానికి ఎండాకాలంలో వేడి చేస్తుందనే కారణంతో చికెన్‌ను తినేందుకు కొందరు ఇష్టపడరు. మరోవైపు ఈ ఎండల దెబ్బకి కోళ్లు పిట్టాల్లా రాలిపోతుండడంతో..ఉత్పత్తిని తగ్గిస్తారు. దీంతో సమ్మర్ వచ్చిందంటే 100 నుంచి 150 లోపు మాత్రమే ధరలు ఉండేవి. కానీ కొన్నేళ్లుగా సమ్మర్ సీజన్‌లో ఎండ వేడికి తట్టుకోలేక..కోళ్లు పెద్ద ఎత్తున చనిపోతుంటాయి.దీంతో ఉత్పత్తి అమాంతం తగ్గిపోతోంది. అయినా ఒకవైపు భారీగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు, దశాబ్ది ఉత్సవాలు జరుగుతుండడంతో..అన్ని గ్రామాల్లో చికెన్‌కు భారీగా పెరిగింది. క్వింటాళ్ళ కొద్ది చికెన్ వంటలు చేయడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతోంది. ఇది కూడా కూడా చికెన్ రేట్లు పెరగడానికి ఓ కారణమైంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తుండడంతో ఇటు రాజధాని హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు సెగల కక్కుతుండడంతో...పెరిగిన ఉష్ణోగ్రతలతో కోళ్లు చనిపోవడం, డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం, దాణా ధరలు, రవాణా చార్జీలు పెరగడంతో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయని..వ్యాపారస్థులు చెబుతున్నారు. వారం రోజుల్లోనే కిలో చికెన్‌ ధర 50 నుంచి 60 వరకు పెరిగింది. ఇక ఆదివారం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు.

చికెన్ ధరలు భారీగా పెరగడంతో మాంస ప్రియుల నోట్లో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయిది. చికెన్ రేట్ల బోర్డును చేసి నిరాశతో వెనుతిరిగి పోతున్నారు. రేట్లు పెరగడంతో సామాన్యులు కిలోకు బదులు, అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. చికెన్ ముక్క తినాలన్నా జేబుకు చిల్లు తప్పడంలేదంటున్నారు. చికెన్‌ ధరలు పెరగడంతో సామాన్యుడి చూపు ఇప్పుడు..చేపలపై పడుతోంది. చేపలు తక్కువ రేటుకే రావడం..అందులోనే చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుండడంతో చాలా మంది చేపలవైపు పరుగులు తీస్తున్నారు.

వేసవిలో కోడి మాంసం ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ధరలపై ప్రభావం చూపుతోంది. అయితే కొద్ది రోజుల్లోనే నైరుతి ఎంట్రీ ఇవ్వటంతో ధరలు తగ్గే అవకాశం ఉంటుందని పౌల్ట్రీ నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories