జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం.. మేయర్ పోడియంను చుట్టుముట్టిన బీజేపీ కార్పొరేటర్లు

Chaos In GHMC Council Meeting
x

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం.. మేయర్ పోడియంను చుట్టుముట్టిన బీజేపీ కార్పొరేటర్లు 

Highlights

GHMC Meeting: విపక్ష కార్పొరేటర్లు తమను దూషించడాన్ని నిరసిస్తూ.. సమావేశాన్ని బహిష్కరించిన జీహెచ్ఎంసీ అధికారులు

GHMC Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభం కాగానే గందరగోళం నెలకొంది. బీజేపీ కార్పొరేటర్లు మేయర్ పోడియంను చుట్టిముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. విపక్ష కార్పోరేటర్లు తమను దూషించడాన్ని నిరసిస్తూ వాటర్ బోర్డు డైరెక్టర్లు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలో అధికారులు సమావేశాన్ని బాయకాట్‌ చేయటం ఇదే తొలిసారి.

బీజేపీ కార్పొరేటర్ల తీరుపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చ జరగకుండా కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ కార్పొరేటర్ల తీరు సరిగ్గా లేదని అధికారులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అధికారులపై ఇష్టవచ్చినట్లు మాట్లాడారని దుయ్యబట్టారు. కౌన్సిల్ సమావేశంలో సమాధానాలు చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నా బీజేపీ కార్పొరేటర్ల కావాలనే గొడవ చేశారని... చర్చ జరగకుండా అడ్డుకోవడం బాధాకరమని మేయర్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories