రాజన్నసిరిసిల్ల జిల్లాలో సెస్‌ పోలింగ్

Cess Polling in Rajanna Sircilla District
x

రాజన్నసిరిసిల్ల జిల్లాలో సెస్‌ పోలింగ్

Highlights

Cess Polling: ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

Cess Polling: రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని సహకార విద్యుత్ సరఫరా సంస్థలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్‌కు సంబందించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 13 మండలాల పరిధిలో 87, వేల 130 మంది ఓటర్లు ఉన్నారు. సెస్‌లో 15 డైరెక్టర్ స్థానాలకు గాను 75 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 202 పోలింగ్ కేంద్రాలు, 252 పోలింగ్ బూతులను, 750 మంది ఎన్నికల సిబ్బంది, 15 మంది రూట్ ఆఫీసర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు 1,100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ బూత్‌ల వద్ద పోలీసులు 144 సెక్షన్‌ను పోలీసులు అమలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories