Telangana Floods: రేపు తెలంగాణకు కేంద్ర బృందం

Central Team Coming to Assess Flood Damage in Telangana
x

Telangana Floods: రేపు తెలంగాణకు కేంద్ర బృందం

Highlights

నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్‌ కీర్తి ప్రతాప్‌ సింగ్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం పర్యటించనుంది.

Telangana Floods: రేపు తెలంగాణలో కేంద్ర బృందం పర్యటించనుంది. వరద ప్రభావిత ప్రాంతాలైన ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలతో పాటు.. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో సెంట్రల్‌ టీమ్‌ పర్యటించనుంది. పంటనష్టంపై అంచనా వేయనున్న బృందం.. అనంతరం వరద బాధితులు, అధికారులతో సమావేశం కానుంది.

నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్‌ కీర్తి ప్రతాప్‌ సింగ్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం పర్యటించనుంది. ఈ టీమ్‌లో కల్నల్‌ కేపీ సింగ్‌తో పాటు ఆర్థికశాఖ, వ్యవసాయశాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, పంటనష్టం, ప్రాణనష్టంపై బాధితులు, అధికారులతో వారు చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories