Telangana: ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రుల పర్యటన

Central Ministers to visit flood-hit Khammam on Friday
x

Telangana: ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రుల పర్యటన

Highlights

Telangana: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న శివరాజ్‌సింగ్ చౌహాన్, బండి సంజయ్

Telangana: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సూచనల మేరకు రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. విజయవాడతో పాటు ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు శివరాజ్‌ వెళ్లనున్నారు. బాధిత కుటుంబాలు, రైతులతో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం విజయవాడలో అధికారులతో సమావేశం కానున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టంపై అంచనాలు రూపొందించే అంశంపై కేంద్రమంత్రి పలు సూచనలు చేయనున్నారు. అనంతరం రేపు తెలంగాణలో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పర్యటించనున్నారు. చౌహాన్‌తో పాటు.. బండి సంజయ్ కూడా ఏరియాల్ సర్వే చేయనున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ ఇద్దరి పర్యటన కొనసాగనుంది. రైతులతో ఆయన మాట్లాడి సమస్యలను తెలుసుకోనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష జరిపనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories