రా రైస్ కొంటామని కేంద్రం క్లారిటీ.. డైలామాలో తెలంగాణ ప్రభుత్వం...

Central Govt Buy Raw Rice Said Piyush Goyal Clearly Makes TS Govt Dilemma | TS News
x

రా రైస్ కొంటామని కేంద్రం క్లారిటీ.. డైలామాలో తెలంగాణ ప్రభుత్వం...

Highlights

TS News: తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న పీయూష్...

TS News: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం రా రైస్ కొంటామని క్లారిటీ ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం డైలామాలో పడిందా..?. ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రులకు కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంతో పాటు ఎటూ తేల్చుకోలేకపోతున్నారా..?.. ఢిల్లీలో కేంద్రమంత్రికి తెలంగాణ మంత్రులు ఏం వివరించారు..? ఢిల్లీలో పరిణామాలపై ముఖ్యమంత్రికి మంత్రులు ఏం వివరించారు...?

ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రైతులు పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలని కేంద్రమంత్రిని కలిశారు రాష్ట్ర మంత్రులు. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని కేంద్రమంత్రి కామెంట్ చేయడంతో తెలంగాణ మంత్రులు కేంద్రం చేసిన అభివృద్ధిని చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి తెలంగాణ రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారని మంత్రులు విమర్శలు గుప్పించారు.

ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ 40 నిమిషాల పాటు సమావేశమైన అనంతరం తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేస్తుందని... కేంద్రం క్లారిటీ ఇస్తుందని భావించారు తెలంగాణ మంత్రులు. తెలంగాణ బీజేపీ నాయకులు రైతులు వరి వేయండి రాష్ట్ర ప్రభుత్వం ఎలా కొనదో చూస్తామని రెచ్చగొట్టారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు మంత్రులు. ఈ విషయం టీఆర్ఎస్- బీజేపీ మధ్య గొడవ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవ కాదని కేంద్రమంత్రి... తెలంగాణ మంత్రులకు సూచించారట.

ఇక ఢిల్లీ వెళ్లిన నలుగురు మంత్రులు దాదాపు 5 గంటల పాటు సీఎంతో సమావేశమై ఢిల్లీలో జరిగిన విషయాలపై సీఎంకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం కొనుగోలుపై క్లారిటీ ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం... రైతులు పండించిన పంటలు కేంద్రం కొనుగోలు చేసే వరకు నిరసన కార్యక్రమాలకు సిద్ధం అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories