రూ 6700 కోట్లు కట్టాల్సిందే.. కేసీఆర్ సర్కార్ కు కేంద్రం డెడ్ లైన్!

Central Govt Big Shock to Telangana Govt
x

తెలంగాణ సర్కార్‌కు కేంద్రం షాక్

Highlights

Telangana: ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆదేశం

Telangana: తెలంగాణకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు తక్షణమే చెల్లించాలని... కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలంగాణను ఆదేశించింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు... ఈ బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది. ఏపీ డిస్కంలు 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్ 10 వరకు విద్యుత్ సరఫరా చేశాయని స్పష్టం చేసింది. ఈ సరఫరాకు సంబంధించి.. 3 వేల 441 కోట్ల 78 లక్షలతో పాటు... 2022 జులై 31 వరకు ఆలస్య రుసుముగా మరో 3 వేల 315 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా ఏపీకి చెల్లింపులు చేయాలంటూ కేంద్ర విద్యుత్ శాఖ తెలంగాణ సీఎస్‌కు సూచించారు.

కేంద్రం ఆదేశాలపై తెలంగాణ సర్కార్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ నుంచి తెలంగాణకు 12 వేల 900 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. విద్యుత్ రంగంలో కేసీఆర్‌ సాధించిన విజయాలను.. బీజేపీ సర్కార్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరాఫరాకు అడ్డంకులు సృష్టించేందుకే ఈ నిర్ణయమని జగదీష్‌రెడ్డి విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు బకాయిలు రావాల్సి ఉందని.. ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణకు విద్యుత్ సరాఫరా చేసినందుకు తమకు 3 వేల 441 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇవాల్సి ఉందని..దానికి వడ్డీ కూడా చెల్లించాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినప్పటికీ బిల్లులు చెల్లించలేదని ఏపీ సర్కార్ వాదిస్తోంది. బకాయులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సర్కార్ పలు మార్లు లేఖలు సైతం రాసింది. అయితే ఏపీ విద్యుత్ సంస్థలే తమకు డబ్బులు చెల్లించాలని తెలంగాణ సర్కార్ చెబుతోంది. విద్యుత్ బకాయిలపై లెక్కలు క్లియర్ చేసుకుందామని లేఖలు రాసినా.. ఏపీ లెక్కలు చూడడం లేదని తెలంగాణ వాదిస్తోంది. డిస్కంల నుంచి బకాయిలు ఉంటే వాటిని వసూలు చేసుకోవాలి కానీ.. జెన్‌ కో చెల్లించాల్సిన డబ్బులు నిలిపివేయడం సరికాదని తెలంగాణ చెప్తోంది. ఈ వివాదంపై రెండు రాష్ట్రాలు జాతీయ కంపెనీల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories