సచివాలయ పనులకు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌

సచివాలయ పనులకు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌
x
Highlights

ప్రపంచమే అబ్బురపడేలా తెలంగాణ సచివాలయ నిర్మాణం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త సచివాలయం పనులు ప్రారంభమయ్యాయి. సమీకృత కొత్త భవన నిర్మాణ పనులను మంత్రి వేముల, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ పరిశీలించారు. అటు నిర్మాణ బాధ్యతలను చేపట్టిన 'షాపూర్ జీ పల్లొంజీ సంస్థ' పనులను మ్ముమ్మరం చేసింది. దీంతో వచ్చే 12నెలల్లో కొత్త సచివాలయం అందుబాటులోకి రానుంది.

కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు రావడంతో తెలంగాణ సచివాలయ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో భవన సముదాయ నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ ప్రాంతంలో అధికారులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఇక సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో ప్రపంచమే అబ్బురపడేలా సచివాలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు మంత్రి వేముల.

సాంకేతిక పరిజ్నానంతో కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం.. భూకంపాలను సైతం తట్టుకునేలా జరుగుతుంది. అటు సీఎం ఆదేశాల మేరకు ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, ఐఐటీ ప్రొఫెసర్స్‌ సహాయంతో సచివాలయం డిజైన్‌ రూపొందించినట్లు మంత్రి వేముల తెలియజేశారు. భవన నిర్మాణంలో దాదాపు 200 పిల్లర్లు ఉంటాయన్న మంత్రి ఒక్కో పిల్లర్‌కు 300బస్తాల సిమెంట్‌తోపాటు 40క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు, నాలుగు టన్నుల స్టీల్‌ ఉపయోగిస్తున్నట్లు వివరించారు.

సెక్రటేరియట్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్న 'షాపూర్ జీ పల్లొంజీ సంస్థ' టార్గెట్‌కు అనుగుణంగా ముందుకెళ్తుందన్నారు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి. ఇక నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు ఆ‍యన. వచ్చే 12నెలల్లో తెలంగాణ సచివాలయ పనులు పూర్తి చేస్తామన్న మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి.. తెలంగాణ ఖ్యాతిని చాటేలా భవన నిర్మాణం జరుగుతుందన్నారు. అటు సచివాలయం లేకుండా పాలన జరుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సమయంలో ప్రభుత్వం సచివాలయ పనులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories