Adilabad: సిమెంటు ఫ్యాక్టరీ తొలగిస్తే... తమభూముల్ని తమకే ఇవ్వాలని డిమాండ్

Cement Corporation of India Factory Closure in Adilabad
x

ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ మూత

Highlights

Adilabad: *ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ మూత *సిమెంటు ఫ్యాక్టరీకి ఆగస్టు 15తేదీ 1982న అంకురార్పణ

Adilabad: నిన్న మొన్నటిదాకా పునరుద్దరిస్తారనుకున్న ఆదిలాబాద్‌లో సిమెంట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా దూరంచేసుకోవాలని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిసైడైంది. అమ్మకానికి సిద్ధమైంది. ఇందుకు సంబందించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో గతకొంత కాలంగా సిసిఐ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనుకున్న కార్మికులకు నిరాశే మిగిలింది సిమెంట్ కార్పొరేషన్ నిర్ణయంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో ఉద్యమానికి రెడీ అవుతున్నారు.

ఆదిలాబాద్ శివారులో కేంద్ర ప్రభుత్వం సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో సిమెంటు ఫ్యాక్టరీకి ఆగస్టు 15తేదీ 1982న అంకురార్పణ చేసింది. 47 కోట్ల రూపాయల వ్యయంతో . 772 ఎకరాల్లో ప్లాంట్‌, 170 ఎకరాల్లో టౌన్‌షిప్‌ ఏర్పాటు చేయగా 1984 మేలో ఉత్పత్తి ప్రారంభమైంది. రోజూ 1,200 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కాగా 48 మిలియన్‌ టన్నుల లైమ్‌స్టోన్‌ డిపాజిట్ల మైనింగ్‌, 32 కేవీ విద్యుత్‌ సరఫరా, నీటి సౌకర్యం ఉన్నాయి. కర్మాగారంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 4వేల కుటుంబాలు ఉపాధి పొందేవి ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఉండడంతో 1993 వరకు సంస్థ లాభాలు ఆర్జించింది. కేంద్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో కోల్‌, జిప్సం, సున్నపురాయి వంటి ముడిసరుకులపై కేంద్ర ప్రభుత్వం రాయితీని ఉపసంహరించుకుంది. లేవీ ప్రకారం ఉత్పత్తితో 60 శాతం సిమెంట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసేవి లేవీని ఎత్తివేయడంతో కర్మాగారం నష్టాలబాట పట్టింది. 1996లో యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేయగా 2008లో ఉద్యోగులు స్వచ్ఛంద విరమణ ప్రకటించడంతో పరిశ్రమను మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది.దీంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో మూతపడిన ప్రభుత్వ రంగసంస్థ సిమెంట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా తొలగించేందుకు రంగం సిద్ధమైంది సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలతో విలువైన భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి కల్పిస్తారని ఆశతో ఇన్నాళ్లు ఎదురుచూసిన కార్మికులు, రైతులు సిమెంట్ కార్పొరేషన్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సిమెంటు ఫ్యాక్టరీని తొలగిస్తే తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలని లేని పక్షంలో సిసిఐ చర్యలను అడ్డుకుంటామని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు.

సిమెంట్‌ కర్మాగారాన్ని పునరుద్ధరించే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివిక్ష చూపుతోందని అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని రాయితీలు ఇస్తామని తెలంగాణ సర్కారు ప్రకటించినా పునః ప్రారంభించడానికి ముందుకు రాకపోగా పరిశ్రమను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు సిసిఐ ప్రకటించడం దారుణమంటున్నారు. గతంలో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఢిల్లీ పెద్దలను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గులాబీనేతలు రాష్ట్ర ఐటీశాఖామంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ సిసిఐ విషయంలో పలుమార్లు కేంద్రంలోని పెద్దలకు లేఖలు రాసినా ఇంతవరకు స్పందించక పోవడం విచారకరమన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి బిజెపి నాయకులు ఈ అంశాన్ని రాజకీయ లబ్దికోసం వాడుకున్నారని , తమను గెలిపిస్తే సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామని హామీలు ఇచ్చి గెలుపొందిన ఎంపీ ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న.

ఇక్కడి సిమెంట్ ఫ్యాక్టరీకి వందల ఎకరాల భూమి వందల కోట్ల ఆస్తులు వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల మిషనరీ దశాబ్దాలకు సరిపడా ముడిసరుకు పుష్కలంగా నీటి వసతి మెరుగైన రవాణా అనువైన మార్కెటింగ్‌ సౌకర్యం ఉంది. వేలాది మందికి ఉపాధి కల్పించే సిమెంట్‌ కర్మాగారంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గతంలో స్థానిక బీజేపీ నాయకులు మాజీ కేంద్రమంత్రి హన్సరాజ్‌ గంగారాంను జిల్లాకు ఆహ్వానించి ఇక్కడి పరిస్థితులను అయన దృష్టికి తీసుకురాగా సీసీఐ కర్మాగారాన్ని పరిశీలించి, త్వరలోనే తెరుస్తామని, కార్మిక కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చి వెళ్లారని, కానీ ఇంతవరకు సిసిఐ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడక పోగా ఉన్న పరిశ్రమను పూర్తిగా మూసివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు దుర్మార్గమని మండిపడుతున్నారు కార్మిక నేతలు. నిర్మాణ రంగం ఊపందుకున్న ఈ తరుణంలో ఫ్యాక్టరీని పునరుద్ధరించి ఉంటే లాభాలను ఆశాజనకంగా పొంది ఉండొచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories