Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దర్యాప్తునకు సీబీఐ కౌంటర్ దాఖలు

CBI Counter Filed For Investigation On Kaleshwaram Project
x

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దర్యాప్తునకు సీబీఐ కౌంటర్ దాఖలు

Highlights

Kaleshwaram Project: ఫిబ్రవరి 2న మరోసారి విచారణ చేయనున్న హైకోర్టు

Kaleshwaram Project: హైకోర్టు ఆదేశిస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ తెలిపింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని.., ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదని హైకోర్టుకు తెలియజేసింది. కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసినా సీబీఐ నుంచి స్పందన లేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

దీనిపై సీబీఐ హైదరాబాద్‌ విభాగం హెడ్‌, ఐపీఎస్‌ అధికారి డీ కళ్యాణ్‌ చక్రవర్తి తన కౌంటర్‌ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రుణాలుగా ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియం నుంచి సైతం ఎలాంటి ఫిర్యాదు అందలేదని హైకోర్టుకు తెలిపారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకుని దర్యాప్తు చేసే అంశంపై సీబీఐకి పరిమితులు ఉన్నాయని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదులపై స్పందించలేదని పేర్కొన్నారు.

పిటిషనర్‌ అందజేసిన ఫిర్యాదుపై పరిశీలన జరుపుతున్నామని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటని తేలాల్సి ఉందన్నారు. కేవలం రాష్ట్ర ఉద్యోగులే ఉంటే నేరుగా జోక్యం చేసుకోవడానికి తమకు అవకాశం ఉండదని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories