Viveka Murder Case: వివేకా కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై తాజా పరిణామం ఇది..

CBI Arguments On Erra Gangireddy Bail Cancel Petition In Viveka Murder Case
x

 Viveka Murder Case: వివేకా కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై తాజా పరిణామం ఇది..

Highlights

Viveka Murder Case: తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డికి బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు నాగేంద్ర, అనిల్‌ వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో గంగిరెడ్డి కీలకమని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో కుట్ర, హత్య చేయడంలో గంగిరెడ్డిది కీలకపాత్రన్నారు. సిట్‌ ఛార్జ్‌షీట్‌ వేయనందునే ఆయనకు బెయిల్ వచ్చిందని...దర్యాప్తు కీలకదశలో ఉన్నందున గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు తెలిపారు.

మరోవైపు గంగిరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. అన్నీ పరిశీలించాకే ఏపీ హైకోర్టు బెయిల్‌ రద్దుకు నిరాకరించిందని చెప్పారు. సాక్షులను ప్రభావితం చేస్తారన్న అనుమానంతో బెయిల్‌ రద్దు చేయరాదన్నారు. సునీత తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న సీబీఐ వాదనను సమర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories