తెలంగాణలో కుల రాజకీయాల హీట్.. క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌ స్ట్రాటజీస్‌ ఏంటి?

Caste Politics in Telangana | Off The Record
x

తెలంగాణలో కుల రాజకీయాల హీట్.. క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌ స్ట్రాటజీస్‌ ఏంటి?

Highlights

Telangana: రాజకీయాలను కులాలు శాసించబోతున్నాయా?

Telangana: తెలంగాణలో కులాల సమీకరణ జెట్‌ స్పీడ్‌గా సాగుతోందా? కులాలను ప్రసన్నం చేసుకునేందుకు పథకాలు, ఆయా వర్గం నేతలను ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహాలు పదునెక్కుతున్నాయా? మరీ ముఖ్యంగా గులాబీ పార్టీ ఇందుకోసం రకరకాల స్ట్రాటజీలు వేస్తోందా? 2023 ఎన్నికల్లో కులాల లెక్కలు పక్కాగా సరిచూసుకున్నవారిదే విజయమని భావిస్తోందా? అధినేత రచిస్తున్న వ్యూహాలేంటి.? ఆయా వర్గాలకు ఎన్ని ఓట్లు ఉన్నాయన్న దానిపై జరుగుతున్న కసరత్తు ఏంటి.? ఏ వర్గం నేతను అందలం ఎక్కించాలి... ఇంకెవరిని పక్కనపెట్టాన్న దానిపై వ్యూహాలు రచిస్తున్న అధినేత ఇంకేమీ ఆలోచిస్తున్నారు?

రాబోయే ఎన్నికల ముంగిట్లో ఉన్న తెలంగాణలో కుల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గులాబీ పార్టీ తమదైన వ్యూహాలతో క్యాస్ట్ ఈక్వేషన్స్‌ వండివారుస్తోంది. బూత్‌ లెవల్‌లో కుల లెక్కలను పక్కాగా చూసుకుంటోంది. తమ ఓటు బ్యాంకు పటిష్టంగా ఉందని భావిస్తూనే, విజయానికి కీలకమైన ఇతర వర్గాల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనెలా, చాపకిందనీరులా క్యాస్ట్ స్ట్రాటజీలను అప్లై చేస్తోంది గులాబీ పార్టీ.

ప్రభుత్వ పరమైన నిర్ణయమే కాదు, రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నారు కేసీఆర్‌. అప్పట్లో ఓసారి సకల జనుల సర్వే ఎందుకు చేయించారో తెలియదు కానీ.. దాన్ని ఎన్నికల స్ట్రాటజీ కోసం పక్కాగా వాడుకుంటున్నారట ఇప్పుడు! కులాల వారిగా ఓటు బ్యాంక్‌పై దృష్టి సారించి పథకాలు ప్రవేశ పెడుతున్నారు. అంతకుముందు కులాల వారీగా ప్రభుత్వ పథకాల పంపిణీ ఉన్నా.. ఇంత పక్కా ఓట్ల లెక్కలు చేయలేదు. ఇప్పుడు ఏ కులం ఓట్లు ఎటు పోతున్నాయో చూసి మరీ సామాజిక సమీకరణాల లెక్కలు వేసి స్ట్రాటజీ వేస్తున్నారట గులాబీ బాస్‌.

ఇందులో భాగంగానే ఎన్టీ రామారావు శత జయంతిని గులాబీ పెద్దలు ఉపయోగించుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ స్టాటజీలో బాగంగానే టీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ నామస్మరణ చేశారన్న విమర్శలు వినిస్తున్నాయి. జై తెలంగాణ, జై కేసీఆర్‌తో పాటు జై ఎన్టీఆర్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కొత్త నినాదాన్ని అందుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు, గతంలొ టీడీపీతో సంబంధం ఉన్న నేతలు విడివిడిగా జై ఎన్టీఆర్ అని నినదించటం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత ఎన్నడూ ఎన్టీఆర్ ఊసెత్తని టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కమ్మ సామాజికవర్గానికి చెందిన ఓట్లు, అక్కడక్కడ మిగిలిపోయిన టీడీపీ ఓటు బ్యాంకు టార్గెట్‌గా ఈ స్టాటజీని అమలు చేశారన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లోని కమ్మ సామాజిక ఓట్ల కోసమే ఈ కొత్త నినాదం అందుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాల్లో సగానికి పైగా పార్టీ, ప్రభుత్వ పదవులు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలకే ఇచ్చిన గులాబీ బాస్‌ ఎన్టీఆర్ పేరుతో ఆ కులస్థులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట.

అంతేకాకుండా, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న మున్నూరు కాపుల ఓట్లు టార్గెట్‌గా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. రీసెంట్‌గా అదే కులానికి చెందిన గాయత్రి రవికి రాజ్యసభ పదవి ఇచ్చి ఆ ఓటు బ్యాంకును టార్గెట్ చేసిందట. లోక్‌సభ ఎన్నికలప్పటి నుంచే మున్నూరు కాపు ఓట్లు బీజీపీ వైపు ఉన్నట్లు లెక్కలు వేసిన టీఆర్ఎస్‌ వ్యూహకర్తలు.. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌ గెలుపునకు, అలాగే, దుబ్బాక, హుజూరాబాద్‌లో మున్నూరు కాపు ఓట్లు బీజీపీకి పోలరైజ్ కావటంతో ఈ ఓటు బ్యాంక్‌పై దృష్టి సారించినట్లు చర్చ జరుగుతోంది.

అదీగాక, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రెడ్డి కులంపై చేసిన కామెంట్స్‌పైన టీఆర్ఎస్ సీరియస్‌గానే రియాక్ట్ అయ్యింది. రెడ్డి పోలరైజేషన్‌తో ఆ వర్గం ఓటర్లను ఆకర్శించేందుకే రేవంత్ ఈ కామెంట్ చేసి ఉంటారని భావించిన టీఆర్ఎస్ ఆ కామెంట్స్‌ను తప్పు పట్టింది. మొత్తానికి ఇలా కులాలవారీగా ఎలా లాభం చేకూరుతుందో పక్కాగా లెక్కలు వేసుకొని మరీ స్ట్రాటజీని అమలు చేస్తున్నారట అధిష్టానం పెద్దలు. కుల సమీకరణలతో వచ్చే సమరానికి సిద్ధమవుతున్న గులాబీ దళం ఏ మేరకు సత్ఫలితాలు సాధిస్తుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories