Caste Census Re-Survey: నేటి నుంచి తెలంగాణలో కులగణన రీస‌ర్వే.. ఈ ఒక్కపని చేస్తే చాలు.. సింపుల్‌..!

Caste Census Re Survey In Telangana From Today
x

Caste Census Re-Survey: నేటి నుంచి తెలంగాణలో కులగణన రీస‌ర్వే.. ఈ ఒక్కపని చేస్తే చాలు.. సింపుల్‌..! 

Highlights

Caste Census Re-Survey: తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వేలో పాల్గొనని వారి వివరాలను నమోదు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.

Caste Census Re-Survey: తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వేలో పాల్గొనని వారి వివరాలను నమోదు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,56,323 కుటుంబాలు కుల గ‌ణ‌న‌ సర్వేలో పాల్గొనలేదని అధికారులు లెక్కతేల్చారు. దీంతో వారికోసం ఇవాళ్టీ నుంచి రీసర్వే నిర్వహించనున్నారు. ఈనెల 28వ తేదీన వరకు కులగణన వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఈసారి ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం కాల్ సెంటర్ మరియు ఆన్‌లైన్ ద్వారా వివరాలు నమోదు చేసే అవకాశం కల్పించింది. 040-21111111 నంబర్‌కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కుల గణనలో పాల్గొనని కుటుంబ సభ్యులు మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.

కేవలం కాల్ సెంటర్ ద్వారానే కాకుండా.. ఈసారి ఆన్‌లైన్ ద్వారా కూడా సర్వేలో పాల్గొనవచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనూ తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్లకు కాల్ చేస్తే.. ఎన్యూమరేటర్లను ఇంటికే పంపించేలా అధికారులు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.

కుల గణనలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లాంటి ప్రతిపక్ష నేతలు పాల్గొనకపోవడం, ఈ సర్వేపై వివాదాస్పద వ్యాఖ్యలు రావడం తెలిసిందే. దీంతో ఈ రీ-సర్వేలో వారు కూడా తమ వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories