Uttam Kumar Reddy: తెలంగాణలో తేలిన కులగణన.. ఏ కులాల వారు ఎంత మంది ఉన్నారంటే?

Caste Census finds that the BC Community Makes up 46.25% of Telangana
x

Uttam Kumar Reddy: తెలంగాణలో తేలిన కులగణన.. ఏ కులాల వారు ఎంత మంది ఉన్నారంటే?

Highlights

Telangana Caste Census Survey: బలహీనవర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణ కోసం కులగణన చేపట్టామన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.

Telangana Caste Census Survey: బలహీనవర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణ కోసం కులగణన చేపట్టామన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ సుల్తానియా రాష్ట్రంలో కులగణన అంశంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేశారు. 96.9శాతం మంది సర్వేలో పాల్గొని వివరాలు అందించగా.. 3.1శాతం వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదని మంత్రి తెలిపారు. ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగిందన్నారు. ఈ నెల 4న మంత్రివర్గం ముందు కులగణన సర్వే నివేదిక ప్రవేశపెట్టి..సమగ్రంగా చర్చించిన తర్వాత శాసనసభలో ప్రవేశ పెడతామన్నారు.

సర్వేలో ముఖ్యాంశాలు

తెలంగాణలోని 3,54,77,554 మంది వివరాలను ఈ సర్వే ద్వారా అధికారులు నమోదు చేశారు.

మొత్తం 1,12,15,131 కుటుంబాల వివరాలు నమోదు చేశారు.

కులగణన సర్వేలో పాల్గొన్న జనాభా 96.90 శాతం

సర్వేలో పాల్గొనని జనాభా 3.10 శాతం

కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 61,84,319, [17.43 శాతం].

ఎస్టీల జనాభా 37,05,929, [10.45 శాతం]

రాష్ట్రంలో బీసీల జనాభా 1,64,09,179, [46.25 శాతం]

ముస్లిం మైనారిటీల బీసీల జనాభా 10.08

ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33 శాతం

ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం

రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతం

రాష్ట్రంలో మొత్తం ఓసీల జనాభా 15.79 శాతం

Show Full Article
Print Article
Next Story
More Stories