TS News: ప్రగతి నగర్లో కారు బీభత్సం.. మద్యం మత్తులో యువకుల వీరంగం

Car Terror In Pragathi Nagar
x

TS News: ప్రగతి నగర్లో కారు బీభత్సం.. మద్యం మత్తులో యువకుల వీరంగం

Highlights

TS News: కారును వెంబడించి మద్యం మత్తులో యువకులకు దేహశుద్ధి

TS News: మద్యం మత్తులోరోడ్డు పై పలు వాహనాలను ఢీ కొట్టి తప్పించుకునేందుకు యత్నించిన ఇద్దరు యువకులను పట్టుకుని దేహశుద్ది చేశారు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ పరిసరాల్లో యువకులు పూటుగా మద్యం సేవించి పోలో కారుతో హల్ ఛల్ చేశారు. వేగంగా కారును నడపడమేగాకుండా... రోడ్డు పక్కన పార్క్ చేసిన కార్లను, ద్విచక్రవాహనాలను ఢీకొట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

పోలో కారును వెంబడించిన స్థానికులు ఏళ్లమ్మ చెరువువద్ద కారును అడ్డగించి, కారులో ప్రయాణిస్తున్న యువకులకు దేహశుద్ధి చేశారు. కారును ధ్వంసం చేశారు. మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా కారును నడిపి వాహనాలను ఢీకొట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు అప్పగించారు. గాయపడిన యువకులను ఆస్పత్రికి తరలించారు.

చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం DL 3 C BY 0410 నంబరు గల పోలో కారు ప్రగతి నగర్ లో పలు ద్విచక్ర వాహనాలను, రోడ్డు పై నిలిపి ఉంచిన ఓ కారును ఢీకొట్టింది. ఢీ కొట్టడమే కారును నిర్లక్ష్యంగా కారును నడుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు ప్రమాదానికి గురైన వాహనదారులు, ఆ పోలో కారును వెంబడించి ఏళ్ళమ్మచేరువు వద్ద కారును అడ్డుకొని, ప్రమాదానికి కారణమైన కారును ధ్వసం చేశారు. కారులో ఉన్న ఇద్దరు యువకులను చితకబాదారు. పోలీసులకు సమాచారం అందటంతో సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ఆ ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ ఇద్దరు యువకులు మద్యం మత్తులో యాక్సిడెంట్స్ చేశారని, వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories