Anantagiri Hills: దుమ్ములేపుతున్నారు.. వికారాబాద్ కొండ‌ల్లో కార్ రేసింగ్

Car Racing In Vikarabad Ananthagiri Hills
x

Anantagiri Hills: దుమ్ములేపుతున్నారు.. వికారాబాద్ కొండ‌ల్లో కార్ రేసింగ్

Highlights

Anantagiri Hills: అటవీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపణలు

Anantagiri Hills: హైదరాబాద్ శివార్లలో రేసింగ్ కల్చర్‌ రోజురోజుకూ పెరుగుతోంది. సెలవు వస్తే శివార్లలో ఏదో ఒక చోట రేసింగ్‌ వాహనాలు దుమ్మురేపుతున్నాయి. నగరం నుంచి క్రమంగా శివార్లకు చేరుకున్న రేసింగులు.. అడవుల్లోకి కూడా పాకాయి. ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం సెలవుతో హైదరాబాద్‌ యువత అనంతగిరి అడవుల్లో రేసింగ్ నిర్వహించారు. అడవిలోకి బయట వాహనాలకు అనుమతి లేకపోయినా ఏకంగా వందల మంది వాహనాలను తీసుకెళ్లి పందేలు కాస్తున్నారు. విచ్చలవిడిగా ఇంత రేసింగ్‌ జరుగుతున్నా.. అటవీ అధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే యువత అడవిలో రేసింగ్ నిర్వహించారంటూ ఆరోపణలు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories