Top
logo

కరీంనగర్ జిల్లాలో కారు బీభత్సం..అదుపు తప్పి కిరాణా షాపు ఎక్కిన కారు

కరీంనగర్ జిల్లాలో కారు బీభత్సం..అదుపు తప్పి కిరాణా షాపు ఎక్కిన కారు
Highlights

కరీంనగర్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వస్తున్న కారు సైకిల్ ను తప్పించబోయి కిరాణా షాపు పైకి...

కరీంనగర్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వస్తున్న కారు సైకిల్ ను తప్పించబోయి కిరాణా షాపు పైకి ఎక్కింది. గన్నేరువరం మండలం గుండ్లపల్లి దగ్గర రాజీవ్ రహదారిపై ఘటన చోటు చేసుకుంది. ఆరు ఫీట్ల పైకి ఎగిరిన కారు కిరాణాషాపుపై పడింది. షాపు పూర్తిగా ధ్వంసం అయ్యింది. నుజ్జునుజ్జయిన కారు షాపుపైనే ఉండి పోయింది.

హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు అతివేగంగా వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 40 నిమిషాల పాటు ఆరుగురు కారులోనే ఉండిపోయారు. వీరిలో నలుగురుకి గాయాలయ్యాయి. ఘటన జరిగిన తీరు చూస్తుంటే ఎంతో పెద్ద ప్రమాదం జరిగినట్లుగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో కారును కిరాణా షాపు నుంచి కిందకు దించారు. గాయపడిన నలుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.లైవ్ టీవి


Share it
Top