ఫుల్లుగా తాగేసి.. అంబులెన్స్‌ను ఢీ కొట్టిన కారు..

ఫుల్లుగా తాగేసి.. అంబులెన్స్‌ను ఢీ కొట్టిన కారు..
x
Accident
Highlights

హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. ఆసుపత్రి బయట నిలిచివున్న అంబులెన్స్ ను అతివేగంతో కారు ఢీ కొట్టింది. షాక్ కలిగించే ఈ ఘటన హస్తినాపురంలో...

హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. ఆసుపత్రి బయట నిలిచివున్న అంబులెన్స్ ను అతివేగంతో కారు ఢీ కొట్టింది. షాక్ కలిగించే ఈ ఘటన హస్తినాపురంలో జరిగింది.

మన్నెగూడలో ఓ బర్త్ డే పార్టీకి తొమ్మిది మంది యువకులు హాజరయ్యారు. తిరిగి కారులో సరూర్ నగర్ కు వస్తున్నారు. అతివేగంతో వస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. హస్తినాపురంలోని ఓ హాస్పిటల్ బయటనిలిచివున్న అంబులెన్స్ ను వేగంగా ఢీ కొట్టింది. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ప్రాణపాయం తప్పింది. మద్యం మత్తులో డ్రైవర్ గంటకు 120 కిలో మీటర్ల స్పీడ్ తో కారును నడిపించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో కారు నడిపిస్తున్న యువకుడితో పాటు మరో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. సీటు బెల్ట్ పెట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న ఎల్ బీ నగర్ పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. గాయపడ్డ నలుగురిని ఆసుపత్రికి తరలించారు. మిగతా ఐదుగురికి వారి వారి ఇళ్లకు పంపించారు. కారులో సోదా చేయగా మద్యం సీసాలు, చికెన్ లభించాయి. సీసీ కెమెరాలో రికార్డు అయిన ప్రమాద దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో యువకులు వుండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories