Hyderabad: సనత్ నగర్ లో భారీగా గంజాయి ఆయిల్.. 12 లక్షలు నగదు స్వాధీనం..

Cannabis Oil Seized in Sanath Nagar Hyderabad
x

Hyderabad: సనత్ నగర్ లో భారీగా గంజాయి ఆయిల్.. 12 లక్షలు నగదు స్వాధీనం..

Highlights

Hyderabad: నిందితుల నుంచి 2లీటర్ల గంజాయి ఆయిల్ నగదు స్వాధీనం

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి ముఠా కొత్త దారులు వెతుక్కుంటోంది. పోలీసుల కళ్లుగప్పేందుకు.. వివిధ పద్దతుల్లో గంజాయి దందా చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా సనత్‌నగర్‌లో గంజాయిను ఆయిల్‌గా మార్చి అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు ఎస్‌ఓటీ పోలీసులు. ముగ్గురు నిందితులు బాలరాజు, సతీష్, నగేష్ లను అరెస్ట్ చేశారు. మరోకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 2లీటర్ల గంజాయి ఆయిల్ నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 5mlతో ఉన్న 20బాటిల్స్ ను సీజ్ చేశారు. అలాగే నగదు, బైక్‌లను స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. పట్టుబడిన గంజాయి ఆయిల్ విలువ 12లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories