Nirmal: భైంసాలో శాంతించిన పరిస్థితులు

Calm conditions in Bhainsa Nirmal District
x
భైంసా (ఫైల్ ఇమేజ్)
Highlights

Nirmal: అప్రమత్తంగా ఉన్న పోలీసు యంత్రాంగం * భైంసా పరిస్థితులపై ఉన్నతాధికారుల పరిశీలన

Nirmal: నిర్మల్‌ జిల్లాలో భైంసాలో చెలరేగిన అల్లర్లు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం ఇరువర్గాల ఘర్షణకు దారితీసిందని వారన్నారు. ఇన్‌ఛార్జ్‌ ఎస్పీ విష్ణు వారియర్‌, రామగుండం సీపీ సత్యనారాయణ భైంసాలోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా వీధుల్లో గస్తీ చేస్తున్నామని 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు.

పట్టణంలో కొత్త వ్యక్తుల సంచారంపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు సీసీకెమెరాలను పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేసి అన్ని వీధులను పరిశీలిస్తున్నారు. మరోవైపు భైంసా ఘర్షణలు సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ కాకుండా పోలీసుశాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆదివారం రాత్రి నుంచే సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ను పోలీసులు నిలిపివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories