TS Assembly: అసెంబ్లీలో కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్‌

CAG Report On Kaleshwaram Project in Assembly
x

TS Assembly: అసెంబ్లీలో కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్‌

Highlights

TS Assembly: కాళేశ్వరంపై సరైన అధ్యయనం జరగలేదన్న కాగ్‌

TS Assembly: తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ రిపోర్టు ప్రవేశపెట్టింది. ఈ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించింది కాగ్‌. కాళేశ్వరంపై సరైన అధ్యయనం జరగలేదని తెలిపింది. అస్తవ్యస్తంగా పనులు ప్రారంభించారన్న కాగ్‌.. మహారాష్ట్రలో ముంపు సమస్యను పరిష్కరించలేదని తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రీ డిజైన్ చేసి కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులుగా విభజించారని కాగ్ వెల్లడించింది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయం 35 వేల కోట్లు కాగా.. రీ డిజైనింగ్ తర్వాత రెండు ప్రాజెక్టుల అంచనా వ్యయం 85 వేల 650 కోట్లకు పెరిగింది. అయితే ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరగగా.. ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగిందని తెలిపింది కాగ్‌. రీ ఇంజినీరింగ్ తర్వాత కూడా మరిన్ని మార్పులు చేశారని.. ఫలితంగా కాళేశ్వరం వ్యయం వడ్డీతో సహా లక్షా 47 వేల 427 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. ప్రాజెక్టు పనుల్లో మార్పుల కారణంగా కొన్ని పనులు నిరర్థకం అయ్యాయన్న కాగ్‌.. ఫలితంగా రూ. 767 కోట్లు నష్టం జరిగిందని తెలిపింది.

కాళేశ్వరం డీపీఆర్‌ తయారు చేసిన వ్యాప్కోస్ పనితీరులో లోపాలను ఎత్తిచూపింది కాగ్‌. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు వ్యాప్కోస్‌ డీపీఆర్ సరిగా రూపొందించకపోవడంతోనే రీ డిజైనింగ్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. అయినా అదే వ్యాప్కోస్ సంస్థకు మరోసారి డీపీఆర్ బాధ్యత అప్పజెప్పారని తెలిపింది. ప్రాజెక్టుతో వచ్చే లాభాలు ఎక్కువ చూపించి.. వార్షిక వ్యయం తక్కువ చూపారని కాగ్‌ నివేదికలో పేర్కొంది. కాళేశ్వరం నిర్వహణకు 10 వేల కోట్లు పడుతోందని వెల్లడించింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పోరేషన్ పేరుతో ప్రభుత్వం 87 వేల 449 కోట్ల రుణాలు తీసుకొచ్చారని.. బడ్జెట్ నుంచి వచ్చింది కేవలం 27 శాతం మాత్రమే చెల్లింపులు జరిగాయని పేర్కొంది కాగ్. కాళేశ్వరంపై ఆదాయం లేదు కాబట్టి రుణాల చెల్లింపు కష్టం అవుతుందని.. బడ్జెట్‌పై భారం పడుతుందని కాగ్ నివేదిక తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories