CAG Report: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాగ్‌ నివేదిక..

CAG Report On Kaleshwaram Lift Scheme
x

CAG Report: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాగ్‌ నివేదిక..

Highlights

CAG Report: చూపిన ప్రయోజనాలకు వాస్తవాలకు మధ్య ఎంతో తేడా

CAG Report: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో కలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపారని కాగ్ తన నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయమూ గణనీయంగా పెరిగిందని. కేంద్ర జలసంఘం ఆమోదించిన డీపీఆర్‌ ప్రకారం 81వేల911 కోట్లు కాగా, తాజా అంచనా ప్రకారం 1,49,317 కోట్లుగా మారిందని కాగ్ నివేదికలో చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విద్యుత్ ఉప్పత్తిలో 46.81శాతం ఈ ఒక్క ప్రాజెక్టుకే అవసరమవుతుందని కాళేశ్వరంపై ఏడాది కాలంగా అధ్యయనం చేస్తున్న కాగ్‌ తన తుది నివేదికలో పొందుపర్చింది.

ప్రాజెక్టు అంచనా వ్యయాన్నీ తక్కువ చేసి చూపించారని కాగ్ నివేదిక చెబుతోంది.. మొదట రెండు టీఎంసీలతో చేపట్టినా తర్వాత మూడు టీఎంసీలకు పెంచారని, ఫలితంగా 28వేల151 కోట్ల రూపాయల పెరిగిందని కాగ్ వ్యాఖ్యానించింది. పాత ధరల అంచనాతో డీపీఆర్‌ తయారు చేశారని. తాజా నిర్మాణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొంటే ప్రతి ఎకరాకు మూలధన వ్యయం ఆరులక్షల 50వేల రూపాయలవుతోందని కాగ్ తెలిపింది. కాగ్ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం విద్యుత్ ఛార్జీలకు 10వేల,374.56 కోట్లు అవసరమవుతుంది. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ దీనికి అదనం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే ఎకరాకు నిర్వహణ ఖర్చు 46 వేల 364 రూపాయలవుతుంది. .కాళేశ్వరం కోసం 87 వేల 949 కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నారు. ఈమొత్తాన్ని 7.8శాతం నుంచి 10.9శాతం వరకు వడ్డీతో తీసుకొన్నారని కాగ్ తన నివేదికలో వ్యాఖ్యానించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories