ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌‌ రెస్క్యూలో క్యాడవర్ డాగ్స్: వీటి ప్రత్యేకత తెలుసా?

Cadavar dogs from Kerala Deployed in SLBC Tunnel Resuce operations
x

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌‌ రెస్క్యూలో క్యాడవర్ డాగ్స్: వీటి ప్రత్యేకత తెలుసా?

Highlights

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల కోసం 13 రోజులుగా గాలింపు జరుగుతోంది. మార్చి 6న కేరళ నుంచి రెండు క్యాడవర్ డాగ్స్ ను ఆర్మీ హెలికాప్టర్ లో తీసుకు వచ్చారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల కోసం 13 రోజులుగా గాలింపు జరుగుతోంది. మార్చి 6న కేరళ నుంచి రెండు క్యాడవర్ డాగ్స్ ను ఆర్మీ హెలికాప్టర్ లో తీసుకు వచ్చారు. తప్పిపోయిన వారి ఆచూకీ కోసం ఈ కుక్కలను ఉపయోగిస్తారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది కోసం క్యాడవర్ డాగ్స్ ను రంగంలోకి దించారు.

క్యాడవర్ డాగ్స్ ప్రత్యేకత ఏంటి?

తప్పిపోయిన లేదా మరణించిన వ్యక్తుల ఆచూకీ కోసం క్యాడవర్ డాగ్స్ ను ఉపయోగిస్తారు. కుళ్లిపోతున్నమాంసాన్ని గుర్తించడంలో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. మనిషి, జంతువుల కుళ్లిన శరీర అవశేషాలను ఈ కుక్కలు గుర్తిస్తాయి. భూమి లోపల 15 అడుగుల లోతులో ఉన్న మనిషి అవశేషాలను కూడా ఇవి గుర్తించే శక్తిని కలిగి ఉంటాయి. బతికి ఉన్న లేదా చనిపోయిన జంతువులు లేదా మనుషుల ఆచూకీని ఇవి గుర్తిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు కలిగిన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ఈ డాగ్స్ సేవలను వినియోగిస్తారు.సాధారణ డాగ్స్ కంటే క్యాడవర్ డాగ్స్ భిన్నమైనవి. మనిషి కంటే కుక్కలకు వాసనలను గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది. మనిషి 40 రకాల వాసనలను గుర్తించే శక్తి ఉంటే కుక్కలకు 40 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే బాంబులు, డ్రగ్స్ వంటి వాటి గుర్తింపు కోసం డాగ్ స్క్వాడ్ ను ఉపయోగిస్తారు.

రెస్క్యూకు అడ్డంకిగా ఊటనీరు

టన్నెల్ లో నిమిషానికి 5 వేల లీటర్ల నీరు బయటకు వస్తోంది.ఇది సహాయక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. దీనికి తోడు దెబ్బతిన్న టీబీఎం మెషీన్ కు చెందిన పరికరాలు కూడా అడ్డంగా మారాయి. టీబీఎం మెషీన్ ను కట్ చేసే పనులు ప్రారంభించారు. మరో వైపు కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేయడం లేదు. కన్వేయర్ బెల్ట్ పనిచేస్తే టన్నెల్‌లోని వేస్టేజీని సులభంగా బయటకు తీసుకురావచ్చు. రెండు రోజుల క్రితం కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేశారు. కానీ, ఒక్క రోజుకే అది పనిచేయకుండా పోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories