ఈ ఏడాది మాతా శిశు మరణాల రేటు తగ్గింది

ఈ ఏడాది మాతా శిశు మరణాల రేటు తగ్గింది
x
Highlights

వైద్యారోగ్య శాఖ 365 రోజులు నిరంత‌రం ప‌ని చేసే శాఖ అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. న‌గ‌రంలోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల కేంద్రంలో...

వైద్యారోగ్య శాఖ 365 రోజులు నిరంత‌రం ప‌ని చేసే శాఖ అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. న‌గ‌రంలోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల కేంద్రంలో వైద్యారోగ్య శాఖ బ‌లోపేతానికి సీఎం కేసీఆర్ నియ‌మించిన కేబినెట్ స‌బ్ క‌మిటీ భేటీ అయింది. మంత్రివర్గ ఉపసంఘంలో ఈటల రాజేందర్ అధ్యక్షత‌న ఏర్పాటైన స‌మావేశంలో మంత్రులు కేటీఆర్, ఎర్ర‌బెల్లి, త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ స‌హా ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడుతూ కరోనా ప్రభావం వ‌ల్ల ప్రపంచవ్యాప్తంగా వైద్యశాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం నెలకొంద‌ని ఆరోగ్య‌శాఖ అని ఆయన అన్నారు.

ప‌్ర‌జా సేవ‌లో ఆరోగ్య శాఖ నిమ‌గ్న‌మైంద‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. ఆ దిశ‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖనుబలోపేతం చేయాలని ఆదేశించిన‌ట్లు తెలిపారు. కరోనా ప్ర‌భావంతో వైద్య శాఖ‌ను మ‌రింత బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. క‌రోనా లాంటి క‌ష్ట‌కాలంలో పనిచేసిన ప్రతి ఒక్క వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. గత ఆరు నెలలుగా అందరూ ఇళ్ళకు మాత్రమే పరిమితమైతే ఆరోగ్య‌శాఖ మాత్రం ప్రజాసేవలో నిమగ్నం అయ్యింద‌ని మంత్రి పేర్కొన్నారు.

అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈటల రాజేందర్ నాయకత్వంలో వైద్యారోగ్యశాఖ ప్రజల్లో భరోసా నింపే విధంగా పనిచేస్తూ కరోనా నుంచి ప్రజలను కాపాడుతుందని పేర్కొన్నారు. ఈసారి సీజ‌న‌ల్ వ్యాధులు త‌గ్గాయ‌ని అలాగే మాతా, శిశు మరణాల రేటు సైతం త‌గ్గింద‌ని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో అదుపులో ప‌రిస్థితి అదుపులోనే ఉందని ఆయన అన్నారు. ఇది ముమ్మాటికి వైద్య ఆరోగ్యశాఖ కృషి ఫలితమే అని తెలిపారు. రానున్న కాలంలో వైద్యశాఖను మరింత బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంద‌ని కేటీఆర్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories