Cab Fare Hike Alert: పీక్ అవర్స్‌లో క్యాబ్ ఎక్కే వారికి షాక్.. జేబులకు చుక్కలు!

Cab Fare Hike Alert: పీక్ అవర్స్‌లో క్యాబ్ ఎక్కే వారికి షాక్.. జేబులకు చుక్కలు!
x

Cab Fare Hike Alert: పీక్ అవర్స్‌లో క్యాబ్ ఎక్కే వారికి షాక్.. జేబులకు చుక్కలు!

Highlights

ఇప్పటివరకు క్యాబ్ ప్రయాణం సౌకర్యంగా అనిపించినా, ఇకపై పీక్ అవర్స్‌లో ఓలా, ఉబెర్, ర్యాపిడో లాంటి క్యాబ్ సేవల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

Cab Fare Hike Alert: ఇప్పటివరకు క్యాబ్ ప్రయాణం సౌకర్యంగా అనిపించినా, ఇకపై పీక్ అవర్స్‌లో ఓలా, ఉబెర్, ర్యాపిడో లాంటి క్యాబ్ సేవల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ (MVAG) 2025 ప్రకారం, క్యాబ్ కంపెనీలు రద్దీ సమయాల్లో రెట్టింపు ఛార్జీలు వసూలు చేయడానికి అనుమతినిచ్చింది. అయితే ప్రయాణికులకు న్యాయం జరిగేలా ఆఫ్-పీక్ సమయంలో కనీస ధర 50% కంటే తక్కువగా ఉండకూడదని షరతు విధించింది.

ఈ మార్గదర్శకాలు రైడ్-హెయిలింగ్ మార్కెట్‌లో పారదర్శకత, బాధ్యత పెంచేలా రూపొందించబడ్డాయి. డ్రైవర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి క్యాబ్ డ్రైవర్‌కు రూ.5 లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కల్పించాల్సిందిగా సూచించబడింది.

డెడ్ మైలేజ్ ఛార్జ్ అనే కొత్త విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. అంటే డ్రైవర్ మీ దగ్గరకు వచ్చే దూరం ఎక్కువైతే అదనపు ఛార్జీలు వర్తిస్తాయి — ముఖ్యంగా మీ పికప్ పాయింట్ 3 కి.మీ దూరంగా ఉంటే.

క్యాబ్ ధరలు నిర్దేశించే అధికారం రాష్ట్రాలదే అయినా, రాష్ట్రాలు నిర్ణయం తీసుకోని పరిస్థుతులలో క్యాబ్ కంపెనీలు తమ ఛార్జీలను ముందుగానే వెల్లడించాల్సి ఉంటుంది. బైక్ టాక్సీల విషయంలోనూ స్పష్టమైన నిబంధనలు ఇవ్వడం గిగ్ వర్కర్లకు ఊరటగా మారే అవకాశం ఉంది. ఉబెర్ వంటి సంస్థలు ఈ మార్గదర్శకాలను స్వాగతిస్తున్నాయని ప్రకటించాయి.

ఇకపై క్యాబ్ ఎక్కేటప్పుడు సమయం, చార్జీల వివరాలను ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి – లేదంటే ఒక్క ప్రయాణమే జేబులు ఖాళీ చేస్తుంది!

Show Full Article
Print Article
Next Story
More Stories