Top
logo

అక్టోబర్‌ 21న హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక

అక్టోబర్‌ 21న హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక
X
Highlights

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావిడి ప్రారంభం కానుంది. హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్‌ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావిడి ప్రారంభం కానుంది. 2018 ఎన్నికల్లో హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యుక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నల్లగొండ ఎంపీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఖాళీ అయిన హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్‌ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా ప్రకటించారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన సందర్భంగా సునీల్‌ ఆరోరా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఉపఎన్నికకు సెప్టెంబర్‌ 23న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. ఉపసంహరణ అక్టోబర్ 3. ఇక పోలింగ్‌ ప్రక్రియ అక్టోబర్‌ 21న, ఓట్ల లెక్కింపు 24న నిర్వహించనున్నారు.

Next Story