Top
logo

హమ్మయ్య...మారుమూల గ్రామాలకు బస్సులు

హమ్మయ్య...మారుమూల గ్రామాలకు బస్సులుగిరిజన గ్రామాలకు తిరుగుతున్న బస్సులు
Highlights

ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపూర్ మండలాల్లోని మారుమూల, అటవీ, గిరిజన గ్రామాలకు నిన్నటి వరకు బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపూర్ మండలాల్లోని మారుమూల, అటవీ, గిరిజన గ్రామాలకు నిన్నటి వరకు బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 53రోజులకు పైగా ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేసిన కారణంగా బస్సు సౌకార్యాలు నిలిచిపోయాయి.

దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రైవేటు వాహనాల్లో ఎక్కువ డబ్బులు చెల్లించి ప్రమాదం అంచున ప్రయాణం చేశారు. కాగా శుక్రవారం నుంచి కార్మికులు విధుల్లో చేరడంతో మళ్లీ మారుమూల, గిరిజన గ్రామాలకు బస్సులు మొదలయ్యాయి. దీంతో వారి ఇబ్బందులు తొలగిపోయాయి.


Web TitleBuses to villages has started after 53 Days of RTC strike
Next Story

లైవ్ టీవి


Share it