ADR Report: కేసీఆర్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..ఆదాయంలో బీఆర్ఎస్ టాప్..రూ 680కోట్ల ఇన్ కమ్

brs-tops-income-aitc-expenditure-chart-among-regional-parties-adr-report
x

5. ADR Report: కేసీఆర్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..ఆదాయంలో బీఆర్ఎస్ టాప్..రూ 680కోట్ల ఇన్ కమ్

Highlights

ADR Report:2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ప్రాంతీయ పార్టీల ఆదాయ జాబితాలో బీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలించింది. ఆ ఏడాది బీఆర్ఎస్ కు ఖర్చులు పోగా..అత్యధికంగా రూ. 680.20కోట్ల ఆదాయం మిగిలింది. ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆర్థిక స్థితిగతులపై పూర్తి సమాచారంతో ఏడీఆర్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడయ్యింది.

ADR Report: మనదేశంలో ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆర్ధిక స్థితిగతులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీల ఆదాయ జాబితాలో బీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఏడాదిలో బీఆర్ఎస్ రూ. 737.67కోట్ల ఆదాయం వచ్చింది. ఈసీకి ఆదాయ, వ్యయ నివేదికలను సమర్పించిన 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 42.38 శాతానికి సమానం.

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం విషయంలో తృణమూల్ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి రూ. 333.45కోట్ల ఆదాయం రాగా..డీఎంకేకు రూ. 214.35కోట్ల ఆదాయం వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 57 ప్రాంతీయ పార్టీలకు గాను 39 పార్టీల వివరణాత్మక ఆదాయ, వ్యయ నివేదికలను సమర్పించాయి. ఈ జాబితాలో టాప్ 5 స్థానాల్లో నిలిచిన పార్టీలు రూ. 1,541.32కోట్ల ఆదాయన్ని గడించాయి. ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 88.56 శాతానికి సమానం. ఇక 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ప్రకటిత ఆదాయం రూ. 1,740.48కోట్లు.

ఖర్చులు పోగా బీఆర్ఎస్ కు భారీ ఆదాయం:

2022-23ఆర్థిక సంవత్సరంలో 19 ప్రాంతీయ పార్టీలు ఖర్చులు పోనూ ఆదాయం మిగిలిందని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి ఖర్చులు పోగా అత్యధికంగా రూ. 680.20కోట్ల ఆదాయం మిగిలింది. బిజూజనదళ్ కు రూ. 171.06 కోట్లు, డీఎంకేకు రూ. 161.72రకోట్ల మేర ఈ విధమైన ఆదాయం లభించింది. దీనికి భిన్నంగా 20 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువయ్యాయని వెల్లడించాయి. కర్నాటకు చెందిన జేడీఎస్ పార్టీ తమ ఆదాయం కంటే ఖర్చులు 490.43 శాతం ఎక్కువగా ఉన్నాయని తెలిపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories