కాంగ్రెస్‌ను జాతీయస్థాయిలో టార్గెట్ చేసిన బీఆర్ఎస్?

BRS Targets Congress at National Level
x

కాంగ్రెస్‌ను జాతీయస్థాయిలో టార్గెట్ చేసిన బీఆర్ఎస్?

Highlights

BRS: కాంగ్రెస్‌ను రాష్ట్రంలో కాకుండా జాతీయ స్థాయిలో టార్గెట్ చేయాలని బీఆర్ఎస్‌ ఫిక్స్ అయిందా?

BRS: కాంగ్రెస్‌ను రాష్ట్రంలో కాకుండా జాతీయ స్థాయిలో టార్గెట్ చేయాలని బీఆర్ఎస్‌ ఫిక్స్ అయిందా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జాతీయ మీడియాలో ప్రొజెక్ట్ అయ్యేలా చూడాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై హైదరాబాద్‌లో కాకుండా హస్తినలో ప్రెస్ మీట్ నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.

అంతే కాదు... రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించాలనేలా కేటీఆర్,హరీశ్ రావుల ప్రెస్‌మీట్ సాగింది. ఫిరాయింపుల విషయంలో తానూ రాజ్యాంగం బుక్‌ను చూపిస్తానని కేటీఆర్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఢిల్లీలో ప్రెస్‌మీట్ నిర్వహించి జాతీయ కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు చేసిందని ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories