నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నిరసనలు

BRS Protests across Telangana today
x

నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నిరసనలు

Highlights

Telangana: నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపు

Telangana: ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్‌ అధినేత తెలంగాణలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేడర్‌కు సూచించింది. ఎంపీ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి...ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడమేనంటూ కేసీఆర్‌ ఆరోపించారు. నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాల దగ్గరికి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి రైతాంగానికి భరోసా కల్పించాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. కొనుగోళ్లు కేంద్రాలను ప్రారంభించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేసీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories