సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

BRS Parliamentary Party Meeting In Pragathi Bhavan
x

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

Highlights

BRS Party Meet: హాజరైన బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

BRS Party Meet: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన BRS పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన ఈ సమావేశం ఇంకా కొనసాగుతోంది. ఈనెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి పార్లమెంటులో చర్చించాల్సిన విషయాలపై చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా బడ్జెట్‌లో కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చరని విభజన హామీలు తదితర అంశాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్థేశం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories