Harish Rao: కాంగ్రెస్ ఇచ్చింది శ్వేతపత్రం లా కాదు.. ఎగవేత పద్దు లా ఉంది

BRS MLA Harish Rao Criticizes Congress
x

Harish Rao: కాంగ్రెస్ ఇచ్చింది శ్వేతపత్రం లా కాదు.. ఎగవేత పద్దు లా ఉంది

Highlights

Harish Rao: మేం ఈసీకి ఫిర్యాదు చేయం.. పథకాలు అమలుచేయాలని కోరుకుంటున్నాం

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో హామీల ఎగవేతకు సిద్ధమవుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు చేశారు. రైతుబంధు నిధుల విడుదల విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. 10 లక్షల ఆరోగ్య శ్రీ ఎవరికి అమలవుతుందో శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్నారు. శ్వేతపత్రాల పేరిట గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రచారం చేస్తూ.. పథకాలకు కోత పెట్టే ప్లాన్‌లో ఉన్నారంటూ విమర్శించారు. నిరుద్యోగుల విషయంలో రాహుల్, ప్రియాంకల హామీల మాటేంటని ప్రశ్నించారు హరీష్ రావు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మార్చి 17 నాటికి వంద రోజులు పూర్తవనుంది. ఆలోపు పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే.. ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు హరీష్ రావు. ఎలక్షన్ కోడ్‌ పరిధిలోకి గ్యారెంటీ స్కీములు వచ్చేలా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పథకాలు అమలుని కోరుకుంటున్నామని.. ప్రభుత్వం పథకాలు అమలు చేస్తే ఈసీకి తమ పార్టీ ఫిర్యాదు ఇవ్వబోదని స్పష్టం చేశారు హరీష్ రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories