ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం

BRS LP and Parliamentary Party meeting under the chairmanship of KCR today
x

ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం

Highlights

KCR: మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం

KCR: ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరగనుండగా.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకావాల్సింగా బీఆర్ఎస్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దత, పార్టీ విస్తరణపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. జూన్ 1న అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభం, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలపై కూడా నేతలతో చర్చించనున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టే దిశగా బీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే పలుమార్లు పార్టీ నేతలతో విస్తృతస్ధాయి సమావేశం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ నిర్వహించారు. ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్దమవ్వాలని, ప్రజల్లోనే ఉండాలని సూచించారు.

వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్‌కు కీలకంగా మారింది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో పార్టీని కేసీఆర్ విస్తరిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రతికూల ఫలితాలు రాకుండా... వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories