Revanth Reddy: రేవంత్ ఉచిత కరెంట్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

BRS Leaders Angry over Revanth Reddy Free Current Comments
x

Revanth Reddy: రేవంత్ ఉచిత కరెంట్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

Highlights

Revanth Reddy: తెలంగాణలో రేవంత్ వ్యాఖ్యల దుమారం

Revanth Reddy: తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేవంత్ ఉచిత కరెంట్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌ వ్యాఖ్యలకు నిరసనగా నిరసనలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ నేతలు శత్రువులు అని.. కాంగ్రెస్ ఆనాడు 9 గంటల ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి తప్పిందని మంత్రి జగదీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతాంగంపై కాంగ్రెస్‌కు ఎందుకంత కక్ష అని.. రైతులకు మొట్టమొదటి శత్రువు కాంగ్రెస్ అంటూ జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. అయితే రేవంత్ వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో పీసీసీ నిర్ణయం ఫైనల్ కాదని.. రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. రేపు రేవంత్‌రెడ్డే స్వయంగా ప్రకటిస్తారని.. కాంగ్రెస్సే రేవంత్, రేవంతే కాంగ్రెస్ అనడం జోక్ అన్నారు. ఇక బీఆర్ఎస్ మాటలను రైతులు ఎవరూ నమ్మొద్దన్నారు ఎంపీ కోమటిరెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories