అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్‌

BRS Aggression In Election Campaign
x

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్‌

Highlights

CM KCR: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు

CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఓ రౌండ్‌ ప్రచారాన్ని పూర్తి చేసిన అధినేత కేసీఆర్‌.. తాజాగా రెండో రౌండ్‌ టూర్‌కి రెడీ అయ్యారు. ఓ వైపు సంక్షేమం, అభివృద్ధి వివరిస్తూ..మరోవైపు హామీలు గుప్పిస్తున్నారు. ఇంకో వైపు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు గులాబీ దళపతి.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ దూసుకుపోతున్నారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఈరోజు నుంచి మరోసారి సుడిగాలి పర్యటనలకు సిద్దమయ్యారు. తొలి విడత మాదిరిగానే..ఒక రోజులో 2 లేదా.. 3 బహిరంగ సభలకు కేసీఆర్ హాజరయ్యేలా గులాబి నేతలు ప్రణాళికలు రెడీ చేశారు.

మారిన షెడ్యూల్‌ ప్రకారం ఈరోజు అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొంటారు. అక్టోబర్ రేపు పాలేరు, మహబూబాబాద్‌, వర్దన్నపేటలలో జరిగే సభలకు హాజరవుతారు. మిగతా సభలు యథావిధిగా జరుగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories