ఇల్లరికం వస్తానని చెప్పి..తీరా పెళ్లిటైంకు పరారైన పెళ్లి కొడుకు !

ఇల్లరికం వస్తానని చెప్పి..తీరా పెళ్లిటైంకు పరారైన పెళ్లి కొడుకు !
x
ఇల్లరికం వస్తానని చెప్పి..తీరా పెళ్లిటైంకు పరారైన పెళ్లి కొడుకు !
Highlights

పీటలదాకా వచ్చిన పెళ్లి వరుడి నిర్వాకంతో ఆగిపోయింది. ఇల్లరికం వస్తానని చెప్పిన ఓ అల్లుడు పెళ్లి పెట్టుకొని ఎవరికి చెప్పకుండా అదృశ్యం అయ్యాడు. ఎక్కడికి...

పీటలదాకా వచ్చిన పెళ్లి వరుడి నిర్వాకంతో ఆగిపోయింది. ఇల్లరికం వస్తానని చెప్పిన ఓ అల్లుడు పెళ్లి పెట్టుకొని ఎవరికి చెప్పకుండా అదృశ్యం అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియలేదు. దీంతో అందరూ షాక్ అయ్యారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా ముధోల్ లో జరిగింది. ఈ సంఘటనతో రెండు కుటుంబాల్లో ఆందోళన నిండుకుంది.

లోకేశ్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి, ముధోల్ గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్ధం సమయంలో అల్లుడు ఇల్లరికం వచ్చేందుకు ఒప్పుకున్నాడు. తీరా రేపు పెళ్లి అనగా ముందు రోజు అల్లుడు పరారయ్యాడు. దీంతో షాకైన అమ్మాయి తరుపు బంధువులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. పెళ్లి ఇష్టంలేక పారిపోయాడో లేదంటే ఇల్లరికం ఇష్టం లేక పారిపోయాడో తెలియడం లేదని అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories