యాదాద్రి లక్మ్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

Brahmotsavam in Yadadri Lakshmi Narasimha Swamy Temple | TS News Today
x

యాదాద్రి లక్మ్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

Highlights

Yadadri Temple: శుక్రవారం నుంచి మొదలుకొని ఈనెల 14 వరకు బ్రహ్మోత్సవాలు

Yadadri Temple: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు..ఈనెల 14 వరకు 11 రోజులపాటు జరగనున్నాయి. తొలి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశ్వక్సేనరాధన, స్వస్తివాచనం, రక్షబంధనం పూజలు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభించారు అర్చకులు. ప్రధానాలయంలో పునర్నిర్మాణం పనులు జరుగుతుండడంతో బాలాలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా శాశ్వత మొక్కు కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమాన్ని రద్దు చేశారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories