Narendra Modi: పార్టీ అధ్యక్షుడి నుంచి అన్నీ పదువుల్లోనూ కుటుంబ సభ్యులే ఉంటారు

Both BRS And Congress Parties Are The Same Said Modi
x

Narendra Modi: పార్టీ అధ్యక్షుడి నుంచి అన్నీ పదువుల్లోనూ కుటుంబ సభ్యులే ఉంటారు

Highlights

Narendra Modi: బీజేపీ మాత్రమే సామాన్యుల కోసం ఆలోచిస్తోంది

Narendra Modi: పాలమూరు సభ వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు ప్రధాని మోడీ. తెలంగాణ ప్రభుత్వ కారు స్టీరింగ్ ఎవరి చేతులో ఉందో ప్రజలకు తెలుసన్నారు మోడీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలే అని.. వాటితో తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందని మోడీ ధ్వజమెత్తారు. అవినీతి, కమీషన్లకు పేరుగాంచిన ఆ రెండు కుటుంబాలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని మోడీ విమర్శించారు. సామాన్య ప్రజల గురించి ఆ కుటుంబాలకు ఎలాంటి ఆలోచన లేదన్నారు. ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలు మాదిరిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని విమర్శించారు. ఆ కంపెనీలో డైరెక్టర్‌, మేనేజర్‌, సెక్రటరీ అన్ని పదవులు ఆ కుటుంబ సభ్యులవేనని ప్రధాని ఎద్దేవా చేశారు. బీజేపీపై ప్రజల ప్రేమ చూసి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు నిద్రపట్టదన్నారాయన.

Show Full Article
Print Article
Next Story
More Stories