అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి హరీశ్ రావు

Bonalu Celebrations In Siddipet
x

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి హరీశ్ రావు

Highlights

Harish Rao: కొత్త కాలనీల అభివృద్ధికి సహకరిస్తా

Harish Rao: సిద్దిపేటలోని THR నగర్, ముత్యాల పోచమ్మ, శ్రీనగర్ రేణుకా ఎల్లమ్మ, మోహినిపురా, దీ కొండ మైసమ్మ, కాళ్లకుంట కాలనీ మైసమ్మ ఆలయాలలో బోనాల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఆయా కాలనీల్లోని బోనాల ఉత్సవాలకు మంత్రి హరీశ్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీశ్ రావు.

ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవార్లను కోరినట్లు మంత్రి తెలిపారు. అలాగే THR నగర్ కాలనీలో UGD, సీసీరోడ్లు, రేషన్ షాపు ఏర్పాటు చేయిస్తానని హామీనిచ్చారు. త్వరితగతిన పూర్తి అయ్యేలా చొరవ చూపుతానని, దశల వారీగా కొత్త కాలనీల అభివృద్ధికి సహకరిస్తానని మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories