తెలంగాణలో మొదలైన బోనాల సందడి

తెలంగాణలో మొదలైన బోనాల సందడి
x
Highlights

తెలంగాణలో బోనాల సందడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులంతా గొప్పగా జరుపుకొనే ఈ వేడుకలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆషాడ మాసంలో వచ్చే ఈ బోనాలు గోల్కొండ...

తెలంగాణలో బోనాల సందడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులంతా గొప్పగా జరుపుకొనే ఈ వేడుకలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆషాడ మాసంలో వచ్చే ఈ బోనాలు గోల్కొండ నుంచి మొదలై..లష్కర్‌తో ముగుస్తాయి. అలాంటి బోనాల కోసం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రంలో ఈ నెల 7 నుంచి బోనాల జాతర ప్రారంభమైంది. దీంతో సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. బోనాల జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరానుండటంతో ఆలయ అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ ఏడాది 3గంటల ఐదు నిమిషాలకు ఆలయం తెరుస్తామని, మంత్రి తలసాని శ్రీనివాస్ చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆలయ ఈవో అన్నపూర్ణ చెప్పారు.

గత ఏడాది అమ్మవారిని దాదాపు 25లక్షల మంది దర్శించుకున్నారని, ఈ సారి కూడా లక్షల సంఖ్యలోనే భక్తులు తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆలయ చైర్మన్. బోనాలు సందర్భంగా ఆలయంలో 40 ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, 200 మంది పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేశారని చెప్పారు. 21వ రోజు భక్తులు బోనాలు సమర్పిస్తారని, 22న భవిష్య వాణి ఉంటుందని ఆయన వివరించారు.

మరోవైపు ఆలయంలో ఏర్పాట్లపై భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఆలయంలో ఏర్పాట్లు బాగుంటున్నాయని, మహిమ గల అమ్మవారు కావడంతో ప్రతి ఏటా బోనాలు సమర్పిస్తున్నామని భక్తులు చెబుతున్నారు.

బోనాల జాతర ప్రారంభం కావడంతో నగరంలో సందడి మొదలైంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories