Jagitial: ఐసోలేషన్ వార్డును సందర్శించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు

Jagitial: ఐసోలేషన్ వార్డును సందర్శించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు
x
Boinapally Vinod Kumar
Highlights

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు జెఎన్టీయు కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డును, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సందర్శించారు.

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు జెఎన్టీయు కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డును, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో వైద్య సేవలు అందించడం వారి సేవలు మరువలేనివని అన్నారు.

ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసిందని, ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే వచ్చి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఐసోలేషన్ కు కావాల్సినవి అన్ని ఉన్నాయని తెలిపారు. హోం క్వారెంటెయిన్లో ఉన్నవారు బయటకు వెళ్ళవద్దని సూచించారు. బయటకు వెళ్ళినట్లైతే పాస్పోర్ట్ సీజ్ చేస్తారని తెలిపారు. క్వారంటైన్ లో ఉన్న వ్యక్తులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories