Srisailam: శ్రీ శైలంలో ధర్మకర్తల మండలి సమావేశం

Board of Trustees Meeting at Srisailam
x

శ్రీ శైలంలో ధర్మకర్తల మండలి సమావేశం

Highlights

Srisailam: 36 అభివృద్ధి పనులకు పాలక మండలి ఆమోదం

Srisailam: శ్రీశైలం దేవస్థాన పాలకమండలి అభివృద్ధి పనులకు ఆమోద ముద్రవేసింది. శ్రీశైలం దేవస్థాన పాలక మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో46 ప్రతిపాదనలకు గాను 36 ఆమోదించారు. ప్రధానంగా మల్లమ్మ కన్నీరు నుండి డంపింగ్ యార్డ్ వరకు నాలుగు కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా తీర్మానం చేశారు. 5 కోట్ల రూపాయలతో శ్రీశైల క్షేత్రంలో 60 బీటీ రోడ్ల నిర్మాణానికి, సిద్ధమఠం ఆలయ అభివృద్ధికి 40 లక్షల కేటాయింపులకు పాలక మండలి ఆమోదించింది.

అటవీ శాఖ నుండి బదలాయించిన వేయి ఎకరాలలో కాటేజీలు రోడ్లు, పార్కింగ్‌ను ఏర్పాటు చేసే విధంగా నిర్ణయాలు తీసుకొని ఆమోదించారు. పాతాళ గంగ నుండి క్షేత్రానికి నీటి పంపింగ్ కోసం రెండు కోట్లు కేటాయించారు. శ్రీశైల అభివృద్ధికి అలానే భక్తుల వసతి, తాగు నీటి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని శ్రీశైలం శాసన సభ్యులు శిల్ప చక్రపాణి రెడ్డి తెలియజేశారు. శ్రీశైల క్షేత్రంలో సుమారు 500 మందికి కరెంటు మీటర్లు లేక ప్రభుత్వ పథకాలు అందడం లేదనీ ఈవో పేరుతో మీటర్లు ఇస్తామని ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories