Black Fungus: తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ టెన్షన్

Black Fungus Tension in Telugu States
x

బ్లాక్ ఫంగస్ ప్రతీకాత్మక చిత్రం

Highlights

Black Fungus: జిల్లాల్లో చాపకింద నీరులా బ్లాక్‌ ఫంగస్‌ * కొవిడ్‌ విజేతలపై బ్లాక్‌ ఫంగస్‌ పంజా

Black Fungus: కరోనా మొదటి దశలో చూడని ఉత్పాతాలెన్నో రెండో దశలో వెలుగుచూస్తున్నాయి. గతంలో కంటే వ్యాధి వ్యాప్తి వేగం, తీవ్రత పెరిగాయి. చికిత్స విధానాల్లోనూ మార్పులు అనివార్యమయ్యాయి. కొవిడ్‌ చికిత్సలో భాగంగా రోగనిరోధక శక్తిని తాత్కాలికంగా అణిచిపెట్టేందుకు ఇచ్చే స్టెరాయిడ్లు మోతాదు మించినా, దీర్ఘకాలంగా మధుమేహంతో బాధ పడుతున్నా.. మరో ముప్పు పొంచి ఉంది. అదే బ్లాక్‌ ఫంగస్‌..‌! ఇప్పడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకున్న వారిలో ఈ వ్యాధి ఆందోళన రేపుతోంది.

ఒకవైపు కరోనాతో దేశమంతా అల్లాడిపోతుంటే... దానికి బ్లాక్ ఫంగస్ కూడా తోడై కోవిడ్ బాధితులను వెంటాడుతోంది. కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వలన ఈ ఫంగస్ వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు అంటున్నారు. కరోనా వచ్చి తగ్గిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఆ సమయంలో బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఎక్కువ. ఇది పాతదే అయినప్పటికీ ఈ కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల కరోనా తగ్గినా కూడా బాధితుల్లో బ్లాక్ ఫంగస్ ఉంటుందనే కోణంలో వారిని పరీక్షించాల్సి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.

తెలుగు రాష్ట్రాలను బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది. ప్రాణాంతక బ్లాక్ ఫంగస్ బారినపడిన రోగులు కంటి చూపును కోల్పోతున్నారు. బ్లాక్ ఫంగస్ పంజాకు ప్రజలు అల్లాడుతున్నారు. ఏపీలో ఫంగస్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటం అందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులను గుర్తించామని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. విశాఖ, శ్రీకాకుళం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కర్నూలులో ఈ కేసులు నమోదయ్యాయి. 6 మరణాలు సంబంవించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు 100 కేసులు ఉన్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ కేసులన్నీ కరోనా బాధితులు... దాని నుంచి కోలుకున్న తర్వాత బయటపడినవే.

ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే తెలంగాణాలో మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ వ్యాధి బారిన పడిన వారి సంఖ్యను ప్రకటించ లేదు. కానీ, బ్లాక్ ఫంగస్ లక్షణాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో కలకలం రేపుతున్నాయి. ఆదిలాబాద్ , ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం రేపుతున్నాయి. వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యల గురించి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు సూచనలు ఇచ్చామని తెలంగాణ ప్రజారోగ్య శాఖ తెలిపింది. వ్యాధి బారిన పడిన వారికి ఉచిత చికిత్స కోసం కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రులను సిద్ధం చేసినట్టు స్పష్టం చేసింది.

దేశంలో ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం ఇది సోకిన వారిలో దాదాపు సగం మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది సోకిన వారిలో మూడోవంతు మంది చూపు కోల్పోతున్నారు. కొంత మందిలో ముఖం వాపు, ముక్కు ఒక వైపు పూర్తిగా మూసుకుపోయినట్లు ఉండటం, కళ్ల వాపు వంటి లక్షణాలు, కీలక పరీక్షల్లో అవయవాల్లో నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తీవ్రమైన డయాబెటిక్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొవిడ్‌ నుంచి కోలుకొనేందుకు వైద్యులు స్టెరాయిడ్‌ ఔషధాలు వాడిస్తున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్‌ కనిపిస్తోంది. అటు బ్లాక్‌ ఫంగస్‌ నియంత్రణకు మందుల కొరత నెలకొంటున్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories