నిజామాబాద్ కార్పోరేషన్ మేయర్ పీఠంపై వీడిన పీఠముడి

నిజామాబాద్ కార్పోరేషన్ మేయర్ పీఠంపై వీడిన పీఠముడి
x
నిజామాబాద్ కార్పోరేషన్ మేయర్ పీఠంపై వీడిన పీఠముడి
Highlights

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారు. ఏ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించలేకపోయింది. నువ్వా నేనా అన్నట్లు మూడు...

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారు. ఏ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించలేకపోయింది. నువ్వా నేనా అన్నట్లు మూడు పార్టీలు తలపడ్డాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ స్థానంపై పీఠముడి వీడింది. ప్రతిపక్షంలో కూర్చుంటామని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రకటించారు. మేయర్ కోసం కావాల్సిన మేజిక్ ఫిగర్ బీజేపీకి లేదన్నారు.

నిర్మాణాత్మక బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని అవినీతి అక్రమాలను అడ్డుకుని అభివృద్ధికి పాడుపడుతామన్నారు ధర్మపురి అర్వింద్. మొత్తం 60 డివిజన్లలో 28 స్థానాల్లో గెలుపొంది బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. టీఆర్‌ఎస్‌కు 13 స్థానాలు దక్కగా, ఎంఐఎం 16, కాంగ్రెస్‌ రెండు, స్వతంత్ర అభ్యర్థి మరో డివిజన్‌లో గెలుపొందారు. దీంతో మేయర్‌ పీఠం కోసం ఉన్న అవకాశాలను పరిశీలించిన అరవింద్‌ కష్టతరంగా మారటంతో ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధపడ్డారు. దీంతో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి కార్పొషన్‌ మేయర్‌ను కైవసం చేసుకోనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories