ఎల్ బీనగర్ నియోజకవర్గంలో సామ రంగారెడ్డి పర్యటన

BJP Sama Rangareddy Basti Baata in LB Nagar
x

ఎల్ బీనగర్ నియోజకవర్గంలో సామ రంగారెడ్డి పర్యటన

Highlights

Sama Ranga Reddy: కేసీఆర్ కు ప్రజాసమస్యలు పట్టడం లేదు

Sama Ranga Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప, ప్రజా సమస్యలు పట్టడం లేదని.. రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆరోపించారు. ఎల్ బీ నగర్ నియోజకవర్గం పరిధిలో పర్యటించిన ఆయన.. ముంపు ప్రాంతాల్లో కలియతిరిగారు. శనివారం సాయంత్రం వనస్థలీపురం డివిజన్ గుంటి జంగయ్య నగర్ కాలనీలో బస్తీ నిద్ర చేసిన ఆయన.. ఈ ఉదయం పార్థివాడ, శ్రీరామ్ నగర్, సద్గురు నగర్ బస్తీలో ఇంటింటికీ తిరుగుతూ.. సమస్యలు తెలుసుకున్నారు.

ముంపు ప్రాంత ప్రజలు కలుషిత నీళ్లతో ఇబ్బందులు పడుతున్నా.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వకుండా.. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ అమలు చేయకుండా.. పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories