మునుగోడుపై బీజేపీ ఫోకస్

BJP Party Focus On Munugodu  By Election
x

మునుగోడుపై బీజేపీ ఫోకస్ 

Highlights

Munugodu: రేపు మునుగోడులో బీజేపీ సభ

Munugodu: గెలుపే లక్ష్యంగా మునుగోడుపై బీజేపీ ఫోకస్ పెట్టింది. రేపు మునుగోడులో బీజేపీ సభ నిర్వహిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభకు హాజరుకానున్నారు. సభలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భాజపాలోకి ఆహ్వానించనున్నారు. ఇవాళ మునుగోడులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. అమిత్ షా సభ ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించనున్నారు.

ఇప్పటికే పలువురు నేతలు నియోజకవర్గంలో పర్యటిస్తూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. దీంట్లో భాగంగానే ఈ నెల 21న మునుగోడులో భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మునుగోడు సభకు అమిత్‌షా వస్తుండటంతో.. సభకు పెద్దఎత్తున జనాన్ని తీసుకొచ్చేందుకు నేతలు యత్నిస్తున్నారు. ఇప్పటికే జన సమీకరణ, ఇతర ఏర్పాట్ల కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం.. మండలానికి ఇద్దరు చొప్పున ఇంఛార్జ్‌లను నియమించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories